Monday, March 10, 2025
HomeఆటROKO: రోహిత్, విరాట్ దాండియా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..!

ROKO: రోహిత్, విరాట్ దాండియా సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా గెలుచుకుంది.. ముచ్చటగా మూడో సారి ఈ ట్రోఫీని భారత్ ముద్దాడింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తుది పోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియాకు ఇది రెండో ICC టైటిల్ కావడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆదినుంచి అద్భుతంగా ఆడిన రోహిత్ సేన.. తుది పోరులో కూడా అంతే అద్భుతంగా ఆడి టైటిల్ గెలుచుకుంది.

- Advertisement -

ఇక ఈ విజయంతో టీమిండియా ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రౌండ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ స్టార్లిద్దరూ స్టంప్స్​తో దాండియా ఆడినిట్లు ఫొటోకు పోజులిచ్చారు. క్రీడాభి మానులు ఈ వీడియో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News