Harmanpreet Kaur Assets Worth: ఒకప్పుడు క్రికెట్ అంటే పురుషులదే.. మహిళల క్రికెట్ అంటే చూసేవారు చాలా తక్కువ మంది. కానీ రోజులు మారాయి. పురుషుల క్రికెట్‌తో సమానంగా ఉమెన్ క్రికెట్‌ని ఆదరిస్తున్నారు. మహిళా క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది. ఇక ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ప్రపంచమంతా భారత మహిళా క్రికెటర్ల వైపు చూస్తోంది. వారికి జేజేలు పలుకుతోంది. ఈ క్రమంలో భారత జట్టును ICC 2025 ఛాంపియన్‌గా నిలబెట్టిన సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తుల టాపిక్ గూగుల్‌లో సెర్చింగ్ లిస్ట్‌కి చేరింది. ఒక్కో మ్యాచ్‌కు హర్మన్ సంపాదన ఎంత అంటూ ఫ్యాన్స్ వెతికేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/sports-news/rohit-sharma-emotional-as-india-women-win-world-cup/
టీమిండియా ఉమెన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ముంబయి నుంచి పాటియాలా వరకు భారీగా ఆస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అన్ని ఫార్మాట్లలో ఆడటంతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంతో కలిపి 2024-25 నాటికి దాదాపు రూ. 25 కోట్లు (సుమారు $250 మిలియన్లు) నికర ఆదాయంగా సమాచారం. హర్మన్‌ప్రీత్ లీగ్ క్రికెట్‌తో పాటు విదేశీ లీగ్‌లో కూడా ఆడుతోంది. అది మాత్రమే కాకుండా WPLలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరిస్తోంది. ఆ టోర్నమెంట్‌పై ఆమె రూ. 1.80 కోట్లు గడిస్తోంది.
అంతేకాకుండా పంజాబ్ పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాతో ప్రభుత్వం హర్మన్ ప్రీత్ కౌర్‌ను గౌరవించింది. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారానే సంవత్సరానికి దాదాపు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ సంపాదిస్తోంది. ఇక కమర్షియల్ షూటింగ్‌లకి దాదాపు రూ. 10-12 లక్షలకి ఒప్పందం కుదుర్చుకుంది. వాటితో పాటు HDFC లైఫ్, ITC, బూస్ట్, CEAT, PUMA, TATA Safari, Asian Paints, Jaipur Rugs, The Omaxe State వంటి బ్రాండ్‌లకు ప్రమోషన్ చేస్తోంది.
Also Read: https://teluguprabha.net/sports-news/india-women-team-wins-world-cup-after-47-years/
ఇక హర్మన్ ప్రీత్ కౌర్ ఫ్యామిలీ ప్రస్తుతం పాటియాలాలోని ఒక విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తోంది. ముంబయిలో ఒక లగ్జరీ కారు, ఒక వింటేజ్ జీప్‌తో సహా పలు మోడళ్ల కార్లను కలిగి ఉంది. అంతేకాకుండా హర్మన్ బైక్ లవర్. తన వద్ద హార్లే-డేవిడ్సన్ లాంటి ఖరీదైన బైక్ కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.


