IPL Auction| ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఈ వేలంలో అంచనాలకు మించి భారత స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోయారు. ఇక తెలుగు ఆటగాళ్ల(Telugu Players)ను కూడా కొన్ని ఫ్రాంఛైజీలు వేలంలో దక్కించుకున్నాయి. గుంటూరు చెందిన 20 ఏళ్ల రషీద్‌ను రూ.30లక్షల బేస్ ప్రైస్‌కి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా రషీద్‌ను సీఎస్కే రూ.20లక్షలకు కొన్ని సంగతి తెలిసిందే.
ఇక విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల పైల అవినాష్‌ను రూ.30లక్షల కనీస ధరకి పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా.. కాకినాడ ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును రూ.30లక్షల ధరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. శ్రీకాకుళం ఆటగాడు త్రిపురణ విజయ్‌ను రూ.30లక్షల ధరతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్, సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్ల అవనీశ్‌ను మాత్రం ఎవరు కొనుగోలు చేయలేదు.
వీరితో పాటు తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.8కోట్లతో రిటైన్ చేసుకోగా.. మహమ్మద్ సిరాజ్‌ను రూ.12.25కోట్లతో గుజరాత్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. ఇక నితీశ్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6కోకట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.