2026 Winter Olympics Condoms shortage: ఇటలీలోని మిలాన్ వింటర్ ఒలింపిక్స్‌లో వింత సమస్య తలెత్తింది. మూడు రోజుల్లోనే 10 వేల కండోమ్ ప్యాకెట్ల స్టాక్ పూర్తి కావడంతో.. నిరోధ్‌ల కొరత ఏర్పడినట్లు నిర్వాహకులు తెలిపారు. అథ్లెట్ల నుంచి ఊహించని డిమాండ్‌తో సమస్య తలెత్తగా.. కొత్త స్టాక్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/pm-rahat-scheme-launched-rs-1-5-lakhs-cashless-treatment/
గత వారం రోజులుగా(ఫిబ్రవరి 6 నుంచి) మిలాన్-కోర్టినాలో 2026 వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన కండోమ్‌ల స్టాక్ అయిపోవడంతో కొత్త సమస్య తలెత్తింది. ఒలింపిక్స్ ప్రారంభం అయ్యాక సుమారు 10వేల కండోమ్ ప్యాకెట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచగా.. ఊహించని డిమాండ్‌తో కేవలం 3 రోజుల్లోనే స్టాక్ అయిపోవడంతో నిర్వాహకులు వెంటనే కొత్త స్టాక్ కోసం పరుగులు తీస్తున్నారు. 92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 2,900 మంది అథ్లెట్లు క్రీడా గ్రామంలో ఉంటున్నారు. స్టాక్ చాలా వేగంగా ఖాళీ అవడంతో నిర్వాహకులు ఖంగు తింటున్నారు.
సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహించడం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు ఉచితంగా కండోమ్‌లు అందిస్తున్నారు. కాగా, గత 2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్ల కోసం 3 లక్షలకు పైగా కండోమ్‌ల స్టాక్‌ను తీసుకురాగా.. ఈ సారి మిలాన్ వింటర్ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా తక్కువ స్టాక్ తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
అయితే కొత్త స్టాక్ ఎప్పుడొస్తుందో తెలియదని ఓ అథ్లెట్ చెప్పినట్లు ఇటాలియన్ మీడియా ‘లా స్టాంపా’ తన కథనంలో వెల్లడించింది. కాగా, త్వరలోనే కొత్త స్టాక్‌ను తీసుకువస్తామని.. ఒలింపిక్స్ ముగిసే వరకు అథ్లెట్లకు కొరత లేకుండా చూస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.

