Sunday, November 16, 2025
HomeఆటRafael Nadal: ఓడిన స్పెయిన్.. ముగిసిన రఫెల్ నాదల్ కెరీర్

Rafael Nadal: ఓడిన స్పెయిన్.. ముగిసిన రఫెల్ నాదల్ కెరీర్

Rafael Nadal| దిగ్గజ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశారు. డేవిస్‌ కప్‌(Davis Cup) టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు చేతిలో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో ఓడిపోయింది. దీంతో నాదల్ కెరీర్ అపజయంతో ముగిసింది. 38 ఏళ్ల ఈ స్పెయిన్ దిగ్గజం తొలి సింగిల్స్‌లో మ్యాచ్‌లోనూ ఓటమి పాలయ్యాడు. బొటిక్‌ వాన్‌డి జాండ్‌షల్ప్‌(నెదర్లాండ్స్‌) చేతిలో 4-6, 4-6తో చేతిలో పోరాడి పరాజయాన్ని చవిచూశాడు. అయితే మిగిలిన స్పెయిన్ ప్లేయర్లు కూడా ఓటమిపాలవ్వడంతో డేవిస్ కప్‌లో స్పెయిన్ పోరాటం ముగిసింది. ఈ క్రమంలో రఫెల్ కెరీర్‌కు ముగింపు పడింది.

- Advertisement -

గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్‌.. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడు టోర్నీల్లో పాల్గొనలేదు. డేవిస్ కప్‌కు ముందు పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌ నిరాశపరిచాడు. ఓవరాల్‌గా నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిళ్లు సాధించగా.. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు.

కాగా డేవిస్ కప్‌లో ఓటమి అనంతరం వీడ్కోలు సమయంలో నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ తన జీవితంలోనే అత్యంత భావోద్వేగమైన రోజు అని తెలిపారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో చివరి సింగిల్స్‌ మ్యాచ్‌ ఆడేశానని.. చివరిసారిగా జాతీయ గీతాలాపన చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోందని ఎమోషనల్ అయ్యాడు. దాదాపు 10 వేల మందికిపైగా అభిమానులు ప్రత్యక్షంగా నాదల్‌ ఆటను చూసేందుకు స్టేడియానికి వచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad