Friday, January 24, 2025
HomeఆటICC: టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ప్రకటించిన ఐసీసీ.. భారత ఆటగాళ్లకు చోటు..

ICC: టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ప్రకటించిన ఐసీసీ.. భారత ఆటగాళ్లకు చోటు..

ఐసీసీ(ICC) తాజాగా టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్-2024(Test Team Of The Year-2024) ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఐసీసీ వన్డే టీమ్‌లో టీమిండియా నుంచి ఒక్కరు కూడా ఎంపిక కాకపోగా… టెస్ట్ టీమ్‌లో మాత్రం ముగ్గురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇందులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల నుంచే 9 మంది ఆటగాళ్లకు స్థానం లభించడం విశేషం. మిగిలిన ఇద్దరిలో ఆస్ట్రేలియా నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరికి అవకాశం లభించింది.

- Advertisement -

టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్..

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్)- ఆస్ట్రేలియా
యశస్వి జైస్వాల్- భారత్
బెన్ డకెట్- ఇంగ్లండ్
కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్
జో రూట్- ఇంగ్లండ్
హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్
కమిందు మెండిస్- శ్రీలంక
జేమీ స్మిత్ (వికెట్ కీపర్)- ఇంగ్లండ్
రవీంద్ర జడేజా- భారత్
మ్యాట్ హెన్రీ- న్యూజిలాండ్
జస్ప్రీత్ బుమ్రా- భారత్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News