Saturday, November 23, 2024
HomeఆటThalasani: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Thalasani: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

యువత చదువుతో పాటు క్రీడాల్లోనూ రాణించి దేశానికి గొప్ప పేరు తీసుకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల బాక్సింగ్ పోటీలలలో గోల్డ్ మెడల్ సాధించిన బాలికను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. బన్సీలాల్ పేటకు చెందిన వర్షిత ఈ నెల 13,14 తేదీలలో షేక్ పేటలో యూత్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా వచ్చే నెలలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగే జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనది. ఈ సందర్బంగా బుధవారం వర్షిత, తన తల్లి సుచిత్ర, కోచ్ మనోజ్ రెడ్డిల వెంట వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. తనకు లభించిన గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ ను మంత్రి ఎదుట ప్రదర్శించింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకురావాలని వర్షితను మంత్రి ఆశీర్వదించారు. మరింత ఉన్నతంగా సాధించేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News