Friday, September 20, 2024
HomeఆటThallada: సీఎం కప్ 2023 పోటీలు ప్రారంభించిన సండ్ర

Thallada: సీఎం కప్ 2023 పోటీలు ప్రారంభించిన సండ్ర

తల్లాడ మండలంలోని వాలీబాల్ కోర్టు నందు సీఎం కప్ 2023 ఆటల పోటీల కార్యక్రమంను ముఖ్య అతిధిగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం MDO రవీంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, క్రీడాలను ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో క్రీడలు ఆడే వారికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. వీటిని ప్రతి ఒక్క క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. తల్లాడ లో కూడ ఇండోర్ స్టేడియం నిర్మాణం కు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు, బి. ఆర్. యస్ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి. భద్రరాజు, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News