Thursday, April 3, 2025
HomeఆటThangallapalli: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మండల అధ్యక్షుడు టోని

Thangallapalli: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మండల అధ్యక్షుడు టోని

గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో జడ్పిటిసి పుర్మాని మంజుల లింగరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ (టోని) గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువతలో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని తెలిపారు. యువత చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించాలని ఆయన కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొయ్యడ రమేష్, ఉపసర్పంచ్ పర్షరాములు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, సుంచుల కిషన్, రాములు, అభిషేక్, నవీన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News