The Hundred: హండ్రెడ్ లీగ్ 2025 తుది దశకు చేరుకుంది. ఈ టోర్నమెంట్ చివరి మ్యాచ్ ఆగస్టు 31న జరగనుంది. అంతకుముందు, సదరన్ బ్రేవ్ వర్సెస్ వెల్ష్ ఫైర్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. కాగా.. అందులో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాటర్ జేసన్ రాయ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ జట్టుకు దూరంగా ఉన్న బ్యాటర్ జేసన్ రాయ్, ది హండ్రెడ్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో 11 బౌండరీలతో తుఫాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ సహాయంతో, సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో సదరన్ బ్రేవ్ తరపున ఆడిన జేసన్ రాయ్ చేసిన తొలి అర్ధ సెంచరీ ఇది. అతనితో పాటు, లూయిస్ డు ప్లూయ్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. వెల్ష్ ఫైర్ తరపున డేవిడ్ పేన్, రిలే మెరెడిత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Read Also: Aadhar: చిన్నారుల ఆధార్ విషయంలో యూఐడీఏఐ కీలక అప్ డేట్
వెల్ష్ ఫైర్‌కు బ్యాడ్ ఓపెనింగ్..
168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెల్ష్ ఫైర్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు వెనువెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 51 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయాయి. వెల్ష్ ఫైర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ టామ్ కోహ్లర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా జట్టుకు సహాయం చేయలేదు. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వెల్ష్ ఫైర్ చాలా పేలవమైన ఆరంభాన్ని పొందింది. ఆ తర్వాత, టామ్ కోహ్లర్-కాడ్మోర్ జట్టును విజయపథంలో నడిపించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ అతను విఫలమయ్యాడు. అతను 46 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు, బెన్ కెల్లావే 20 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇది కాకుండా, ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో, వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 6 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో మ్యాచ్‌ను ఓడిపోయింది. క్రెయిగ్ ఓవర్టన్ సదరన్ బ్రేవ్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేసి 20 బంతుల్లో 22 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. జోర్డాన్ థామ్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Also: Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఎక్కువ కోచ్లతో వందేభారత్ రైళ్లు


