Abhishek Sharma Girlfriend: ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాను పైనల్ కు చేర్చాడు. వరుసగా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడుతూ టీ20ల్లో వరల్డ్ నెం.1గా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సూపర్-4లో పాక్ పై 74 పరుగులు, బంగ్లాపై 75 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇతడు కేవలం మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉన్నాడు. అభిషేక్ వర్మ గర్ల్‌ఫ్రెండ్ తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమె లైలా ఫైసల్. ఇంతకీ ఆ యువతి నేపథ్యం ఏంటి? నిజంగా లైలా, అభిషేక్ ప్రేమలో ఉన్నారా? అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరీ లైలా ఫైసల్?
లైలా ఫైసల్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఈమె ప్రముఖ కాశ్మీరీ ముస్లిం ఫ్యామిలీకి చెందినది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురంలో తన ప్రైమరీ ఎడ్యూకేషన్ ను పూర్తి చేసింది. అనంతరం లండన్‌లోని కింగ్స్ కళాశాలలో సైకాలజీ చదివింది. ఇండియాకు తిరొచ్చిన లైలా తన తండ్రి కంపెనీకి సీఈఓగా పనిచేసింది. మూడేళ్ల కిందట తన తల్లితో కలిసి లైలా రూహి ఫైసల్ డిజైన్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీను ఆమె నడుపుతోంది.
Also Read: IND vs BAN – ఆసియాకప్ ఫైనల్‌కు చేరిన భారత్
అభిషేక్ శర్మ, లైలా పైసల్ మధ్య పరిచయం ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టైంలో జరిగింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు. ఇంగ్లాండ్‌పై అభిషేక్ చేసిన 135 పరుగుల ఇన్నింగ్స్‌కు విసెష్ చెబుతూ లైలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. వీరి బంధాన్ని ఈ జంట అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పటి వరకు తన బ్యాటింగ్ తో వార్తల్లో నిలిచిన అభిషేక్ .. ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత జీవితంతో ట్రెండింగ్ లో నిలిచాడు.
వరుస విజయాలు
ఆసియా కప్ 2025లో భారత జైతయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్ కు చేరింది. లీగ్ దశలో యూఏఈ, పాక్, ఒమన్ పై గెలిచిన భారత్.. సూపర్-4లో పాక్, బంగ్లాదేశ్ పై గెలిచింది. మరోవైపు పాక్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్లో ఇండియాతో తలపడతారు.


