ఈ ఏడాది మరో 10 రోజుల్లో ముగియనుంది. భారత క్రికెట్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలు, కొన్ని చేదు విషయాలు.. తీపి చేదు కలయికగా 2024 సంవత్సరం ముగింపు పలికేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్లు ఆటకు(Cricketers Retirement) వీడ్కోలు పలికారు.
వీరిలో దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు ఉండటం గమనార్హం. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్, కోహ్లీ, జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు.
మరోవైపు సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
2024లో భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు వీరే..
- విరాట్ కోహ్లీ – T20లకు రిటైర్మెంట్
- రోహిత్ శర్మ – T20లకు రిటైర్మెంట్
- రవీంద్ర జడేజా -T20లకు రిటైర్మెంట్
- శిఖర్ ధావన్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- దినేష్ కార్తీక్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- ఆర్. అశ్విన్- అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- సౌరభ్ తివారీ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- వరుణ్ ఆరోన్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- కేదార్ జాదవ్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- బరీందర్ సరన్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- వృద్ధిమాన్ సాహా – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- సిద్ధార్థ్ కౌల్ – అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్