Saturday, November 23, 2024
HomeఆటThimmapur: ఆటలతో ఆనందం, ఆరోగ్యం

Thimmapur: ఆటలతో ఆనందం, ఆరోగ్యం

12 రోజుల పండుగలా..

ఆటలతో మానసికోల్లాసంతో పాటు శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడుతుందని జ్యోతిష్మతి అటానమస్ కళాశాలల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాలలో ‘స్పోర్ట్స్ ఫిస్టా – 2024’ ప్రారంభించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, పన్నెండు రోజులపాటు కళాశాల ఆవరణలో జరిగే క్రీడా పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ కళాశాలకు అలాగే తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారం, త్రో బాల్, టేబుల్ టెన్నిస్ తో పాటు బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహిస్తామనీ, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా పోటీలు జరుగుతాయని చెప్పారు. తదనంతరం ఆయన టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, డీన్ అకడమిక్స్ డాక్టర్ వైశాలి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పీ సంపత్ రావు, కో ఆర్డినేటర్స్ సీ హెచ్ సజన్ రావు, రాజేష్ గుణ, సత్య తేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News