2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అతి చిన్న వయస్కుడైన గుకేష్ భారతీయుడు నిలిచాడు. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచు రాజు కండ్రిగ కావడంతో గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. ఫిడె ప్రపంచ చెస్ విజేతగా దొమ్మరాజు గుకేష్ నిలవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ లు గుకేష్ అభినందనలు తెలిపారు.

చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై గుకేష్ (భారత్) విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభినందనలు తెలిపారు. చివరి గేమ్‌లో భారత్‌కు చెందిన గుకేష్ విజయం సాధించారు. ప్రపంచ ఛాంపియన్‌గా అత్యంత పిన్న వయస్కుడైన గుకేష్ నిలవడం తోపాటు తిరుపతి జిల్లా వాసు కావడం పట్ల జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.