Thursday, September 12, 2024
HomeఆటThurkapalli: గోల్డ్ మెడల్ సాధించిన పెండెం అఖిల

Thurkapalli: గోల్డ్ మెడల్ సాధించిన పెండెం అఖిల

భువనగిరి పట్టణంలోని ఎమ్మెన్నార్ గార్డెన్ లో టైగర్స్ కుంగ్ పు అకాడమీ రాష్ట్ర కార్యదర్శి మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4వ జాతీయస్థాయి కుంగ్ పు, కరాటే, తైక్వాండో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి 2000 మంది కుంగ్ పు కరాటే తైక్వాండో క్రీడాకారులు హాజరై కటాస్ స్పారింగ్ వెపన్స్ విభాగంలో పోటీల్లో తలబడ్డారు.

- Advertisement -

ఈ పోటీల్లో అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ భువనగిరి లో 8వ తరగతి చదువుతున్న తుర్కపల్లి మండల కేంద్రానికి పెండెం అఖిల ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా అకాడమిక్ రాష్ట్ర కార్యదర్శి మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడు విద్యార్థినీ విద్యార్థులకు, యువతీ యువకులకు ఈ యొక్క కుంగ్ పు కరాటే మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమని ముఖ్యంగా అమ్మాయిలకు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం సెల్ఫ్ డిఫెన్స్ అలవర్చుకుంటారని తెలిపారు.

ఈ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన పెండెం అఖిలను పాఠశాల ఉపాధ్యాయ బృందం, తుర్కపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు అభినందించారు. రాబోవు కాలంలో మరిన్ని మెడల్స్ సంపాదించి జిల్లాకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News