India vs West Indies 2nd Test Match: నేటి నుండి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన రెండో టెస్టు జరగనుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను క్వీన్ స్వీప్ చేయాలని టీమ్ ఇండియా.. ఎలాగైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని విండీస్ జట్లు భావిస్తున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో కరేబియన్ జట్టును గిల్ సేన ఓడించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానుంది. టాస్ ఉదయం 9:00 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ లో పిచ్ కీలకపాత్ర పోషించనుంది. ఈ గేమ్ లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటి వరకు 101 మ్యాచులు జరగ్గా..భారత్ 24, విండీస్ 30 గెలవగా..47 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
నితీష్ కు ప్రమోషన్
గిల్ సేన భీకరమైన ఫామ్ లో ఉంది. రాహుల్, గిల్, జురేల్, జడేజాలు బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. ఇదే ఫామ్ ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గత మ్యాచ్ లో విఫలమైన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ తోనైనా గాడిన పడాలని చూస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని నితీష్ రెడ్డికి మరోక అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ మ్యాచ్ లో నితీష్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లో కూడా ఇతడికి మరిన్ని ఓవర్లు వేసే అవకాశం కల్పించనున్నారు. ఆల్ రౌండర్లుగా జడేజా, సుందర్ తమ పాత్రకు తగిన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జడేజా బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో అదరగొడుతున్నాడు.
ఫిరోజో షా కోట్ల మైదానం స్పినర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పినర్ గా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. జడేజా, సుందర్ కూడా స్పిన్ వేస్తారు కాబట్టి వేరొక బౌలర్ అవసరం లేదు. ఇక పేస్ ద్వయం బుమ్రా, సిరాజ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. అయితే పని భారం కారణంగా వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
టీమ్ ఇండియా ఫ్లేయింగ్ XI అంచనా: శుబ్‌మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్.
Also Read: ICC Rankings 2025 – టాప్-5 కోల్పోయిన జైస్వాల్.. ఎగబాకిన సిరాజ్, జడేజా..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్లు
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), ఎన్ జగదీశన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ నిత్ యాదవ్, దేవ్‌దత్ యాదవ్, దేవ్‌దత్త్ యాదవ్,
వెస్టిండీస్ జట్టు: జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్(కెప్టెన్), షాయ్ హోప్(వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, ఖరీ పియరీ, జోహన్ లేన్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్, జెడియా బ్లేడ్స్, కెవ్‌లాన్ ఇమ్లాన్‌స్


