Saturday, November 15, 2025
HomeTop StoriesIND W vs AUS W 2nd semi-final: మరికొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా హైవోల్టేజ్ పోరు.....

IND W vs AUS W 2nd semi-final: మరికొన్ని గంటల్లో భారత్-ఆస్ట్రేలియా హైవోల్టేజ్ పోరు.. ఫ్లేయింగ్ 11 ఇదే!

IND W vs AUS W Dream11 Prediction, 2nd Semi-Final: ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది దశకు వచ్చేసింది. ఈరోజు సెమీఫైనల్లో రెండో మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఫైనల్ కు చేరాలని టీమ్ ఇండియా భావిస్తోంది. భారత మహిళల జట్టు మూడు విజయాలు, మూడు ఓటములతో లీగ్ దశను ముగించుకుంది. బంగ్లాదేశ్ మహిళలతో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది.

- Advertisement -

నవీ ముంబై స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఇరు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. లీగ్ దశలో మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా మహిళలు ఆజేయంగా ఉంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్ తోపాటు జియో హాట్ స్టార్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం, ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

Also Read: IPL 2026 Auction -బిగ్ అప్ డేట్.. ఐపీఎల్ ఆక్షన్ డేట్ వచ్చేసింది..!

ప్లేయింగ్ XI అంచనా:

భారత జట్టు: రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఎస్ మంధాన, జెఐ రోడ్రిగ్స్, హెచ్ కౌర్ (కెప్టెన్), హెచ్ డియోల్, డిబి శర్మ, స్నేహ్ రాణా, అమంజోత్ కౌర్, రేణుకా సింగ్, ఎన్ఆర్-శ్రీ చరణి, షఫాలీ వర్మ

రిజర్వ్ బెంచ్: ఉమా చెట్రీ, ప్రతికా రావల్, రాధా యాదవ్, కె గౌడ్, ఎ రెడ్డి

ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), బిఎల్ మూనీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, టిఎం మెక్‌గ్రాత్, ఎ గార్డ్నర్, ఇఎ పెర్రీ, ఎ సదర్లాండ్, కెజె గార్త్, ఎ కింగ్, ఎంఎల్ షుట్, ఎస్ మోలినెక్స్

రిజర్వ్ బెంచ్: జార్జియా వోల్, జి వేర్‌హామ్, జిఎం హారిస్, డార్సీ బ్రౌన్, హెచ్ గ్రాహం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad