MI-W vs RCB-W Dream11 Prediction: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ ధమాకా ఆరంభానికి సిద్ధమైంది. నేడు (జనవరి 9, శుక్రవారం) నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (MI-W) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB-W) జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ యాప్ ద్వారా వీక్షించవచ్చు.
హెడ్-టు-హెడ్ రికార్డులు
ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్లలో ఈ రెండు జట్లు 7 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై నాలుగు మ్యాచుల్లో, ఆర్సీబీ మూడు మ్యాచుల్లో గెలుపొందాయి. గత సీజన్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే.
పిచ్ మరియు వెదర్ రిపోర్ట్
డీవై పాటిల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. అయితే ఆరంభంలో పేసర్లకు స్వింగ్ లభిస్తుంది. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఆకాశం కొంచెం మేఘావృతమై ఉంటుంది. వర్షం ముప్పు లేదు. ఉష్ణోగ్రత 28°C గా నమోదయ్యే అవకాశం ఉంది.
ప్లేయింగ్ XI అంచనా
ముంబై ఇండియన్స్ (MI-W): హేలీ మాథ్యూస్, జి. కమలిని (వికెట్ కీపర్), నాట్ సైవర్-బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), పూనమ్ ఖెమ్నార్, అమంజోత్ కౌర్, సజన సజీవన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సంస్కృతి గుప్త.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB-W): స్మృతి మంధాన (కెప్టెన్), జార్జియా వోల్, దయాలన్ హేమలత, గ్రేస్ హారిస్, నడిన్ డి క్లెర్క్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, అరుంధతి రెడ్డి.
Also Read: WPL 2026 -నేటి నుంచే మహిళల ప్రీమియర్ లీగ్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
పూర్తి జట్లు
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమంజోత్ కౌర్, జి. కమలిని, అమేలియా కెర్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజన సజీవన్, రహిలా ఫిర్దౌస్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, నల్లా రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, నాడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, ప్రత్యూష కుమార్, డి. హేమలత, సయాలీ సత్ఘరే

