Saturday, October 5, 2024
HomeఆటMohammed Shami : బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌

Mohammed Shami : బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్‌

Mohammed Shami : బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆదివారం బంగ్లాతో మూడు వ‌న్డేల సిరీస్ ఆరంభం కానుండగా గాయం కార‌ణంగా భార‌త సీనియ‌ర్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ దూరం అయ్యాడు. ఈ మ్యాచ్‌కే కాకుండా మొత్తం వ‌న్డే సిరీస్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డం లేదు. ఈ విష‌యాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది. అత‌డి స్థానంలో యువ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసింది.

- Advertisement -

“బంగ్లాదేశ్ తో ప‌ర్య‌ట‌న‌కు ముందు నిర్వ‌హించిన ట్రైనింగ్ సెష‌న్లో ష‌మీకి గాయ‌మైంది. అత‌డు ప్ర‌స్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌కు అత‌డు వెళ్ల‌లేదు. అత‌డి గాయం తీవ్ర‌త ఎంత అనేది ఇంకా తెలియ‌రాలేదు.” అని బీసీసీఐ తెలిపింది.

వ‌న్డే సిరీస్‌కు ష‌మీ అందుబాటులోకి ఉండ‌క‌పోయినా పెద్ద‌గా న‌ష్టం అయితే లేదు గానీ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు అత‌డు అందుబాటులోకి రావాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఎందుకంటే వ‌చ్చే ఏడాది ఓవ‌ల్‌లో జ‌ర‌గ‌బోయే ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ రేసులో టీమ్ఇండియా ఉండాలంటే ఇప్ప‌టి నుంచి ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌లో గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా బుమ్రా మ్యాచ్‌లు ఆడ‌డం లేదు. ఇప్పుడు ష‌మీ కూడా దూరం అయితే మాత్రం చాలా క‌ష్టం. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌రుపున ష‌మీ 60 టెస్టులు ఆడి 216 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా మూడు వ‌న్డేలు, రెండు టెస్టులు ఆడ‌నుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News