Chris Gayle RCB Entry: ఐపీఎల్ హిస్టరీలో డేంజరస్ బ్యాటర్లలో ఒకడైన క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టులోకి తన పునరాగమనం ఎలా జరిగిందో తాజాగా వెల్లడించాడు. 2011లో ఐపీఎల్ వేలంలో ఏ టీమ్ తనను కొనుగోలు చేయకపోతే తీవ్ర నిరాశ చెందాను. అప్పడే తాను జమైకాలోని ఒక నైట్ క్లబ్ లో ఉండగా ఊహించని విధంగా ఆర్సీబీ నుంచి పిలుపు వచ్చిందని గేల్ గుర్తుచేసుకున్నాడు. ఆ ఒక్క ఫోన్ కాల్ తన కెరీర్ ను మార్చేసిందని గిల్ గుర్తు చేసుకున్నాడు.
2011 ఐపీఎల్ వేలానికి ముందు రెండు సంవత్సరాలు కోల్‌కతా నైట్ రైడర్స్(Kkr)కు ప్రాతినిధ్యం వహించాడు గిల్. తర్వాత కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసింది. 2011 ఆక్షన్ లో గిల్ ను కొనేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. అదే సమయంలో అతడు వెస్టిండీస్ జాతీయ జట్టుకు సెలెక్ట్ కాలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. అదే టైంలో ఆర్సీబీ బౌలర్ డిర్క్ నాన్నెస్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. అతడి స్థానంలో ఒక పవర్ హిట్టర్ కోసం గాలిస్తున్న ఆర్సీబీ యాజమాన్యం దృష్టి విధ్యంసక బ్యాటర్ అయిన గిల్ పై పడింది.
ఆర్సీబీలో తన ఎంట్రీకి సంబంధించిన క్షణాలను గుర్తుచేసుకుంటూ గేల్ ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడాడు. ”2011లో నేను జమైకాలోని ఒక నైట్ క్లబ్ లో ఉన్నప్పుడు నాకు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికే ప్రపంచకప్ ఓటమి, జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో తాను తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. అప్పుడే నాకు విజయ్ మాల్యా, అనిల్ కుంబ్లే నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లు నువ్వు ఫిట్ గా ఉన్నావా అని అడిగారు. నేను అవునని సమాధానమిచ్చాను. వెంటనే వాళ్లు రేపు ఉదయం ఎంబసీకి వెళ్లి వీసా తీసుకో అన్నారు. రేపు శనివారం కదా అని నేను ప్రశ్నించాను. దాని గురించి నువ్వు ఏం ఆలోచించకుండా అక్కడకు వెళ్లు చాలు అని చెప్పారు. తర్వాత రోజు వెళ్లి వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు” అని గేల్ చెప్పుకొచ్చాడు.
Also Read: Asia Cup 2025 : మూడు జట్ల నుంచి ఎనిమిది జట్ల వరకు.. తొలి విజేత భారత్!
ఐపీఎల్ లో గేల్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ రిచ్ లీగ్ లో ఓపెనర్ గా అతడి చేసిన అద్భుతాలు అంతా ఇంతా కాదు. ఆర్సీబీ తరపున ఆడిన తొలి సీజన్ లోనే పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 12 మ్యాచుల్లోనే 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్ కు చేరడంలో గేల్ కీ రూల్ పోషించాడు.


