Monday, December 9, 2024
HomeఆటUrvil Patel: 28 బంతుల్లోనే సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు

Urvil Patel: 28 బంతుల్లోనే సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు

Urvil Patel| సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Sayad Mushtaq Ali Trophy)లో మరో రికార్డు నమోదైంది. గుజరాత్ టీమ్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel)కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మధ్యప్రదేశ్ వేదికగా త్రిపుర జట్టుతో జరిగిన మ్యాచులో ఏడు ఫోర్లు, 12 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే శతకం చేశాడు. దీంతో గతంలో 32 బంతుల్లో సెంచరీ చేసిన భారత ఆటగాడు రిషబ్ పంత్(Risabh Pant) రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే గతేడాది చండీగఢ్‌ వేదికగా అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఉర్విల్‌ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 41 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇప్పుడు 28 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఉర్విల్ పేరు మార్మోమోగుతోంది. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో అన్‌సోల్డ్‌ బ్యాటర్‌గా ఉర్విల్ నిలవడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News