Saturday, November 15, 2025
HomeఆటUS Open 2025: చరిత్ర సృష్టించిన సెర్బియా దిగ్జజం.. రికార్డు స్థాయిలో సెమీస్ కు...

US Open 2025: చరిత్ర సృష్టించిన సెర్బియా దిగ్జజం.. రికార్డు స్థాయిలో సెమీస్ కు జకోవిచ్..

- Advertisement -

Novak Djokovic Creates History: యూఎస్ ఓపెన్ 2025 సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు సెర్బియా దిగ్గజం నోవాక్ జకోవిచ్. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడానికి మరో ముందడుగు వేశాడు. భారత కాలమానం ప్రకారం, బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడో సీడ్ జకోవిచ్ 6-3, 7-5, 3-6, 6-4 పాయింట్ల తేడాతో..యూఎస్ స్టార్ ప్లేయర్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. శుక్రవారం జరిగే సెమీస్ లో కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్)తో జకోవిచ్ తలపడనున్నారు. ఇప్పటివరకు అల్కరాజ్ తో ఎనిమిదిసార్లు తలపడగా ఐదింట్లో విజయం సాధించాడు జకోవిచ్.

జకో వరల్డ్ రికార్డు

38 ఏళ్ల నోవాక్ జొకోవిచ్.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి 2025 యూఎస్ ఓపెన్‌లో సెమీ-ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. అతను 53వసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్ కు చేరి మరో రికార్డును నెలకొల్పాడు.

మ్యాచ్ జరిగిందిలా..

బుధవారం జరిగిన మ్యాచ్ లో జకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి గెలిచాడు. నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ ఎంత ప్రతిఘటించినా జకో విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. టేలర్ రెండో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చి మూడో సెట్ నెగ్గాడు. దీంతో మ్యాచ్ నాలుగో సెట్ దాకా వెళ్లింది. ఈ క్రమంలో జకోవిచ్ తన అనుభవంతో ఒత్తిడిని జయించి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 12 ఏస్‌లు, 35 విన్నర్లు కొట్టాడు. అయితే 29 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతో పాటు 6 బ్రేక్ పాయింట్స్ సాధించాడు.

Also Read: Asia Cup 2025-ఆసియా కప్‌లో ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నం కాబోతున్న టీమిండియా బ్యాటర్లు వీళ్లే..!

మరోవైపు టేలర్ చేసిన 51 అనవసర తప్పిదాలు అతని కొంపముంచాయి. దీంతోపాటు అతడు 10 ఏస్‌లు, 46 విన్నర్లు కొట్టాడు. ఫ్రిట్జ్‌ ఐదు డబుల్ ఫాల్ట్‌లతో పాటు 2 బ్రేక్ పాయింట్స్ వచ్చాయి. అతడికి 13 బ్రేక్ పాయింట్స్ సాధించే అవకాశం వచ్చినా.. అతడు రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇదే అతడి ఓటమిని ఖరారు చేసింది. తాజా విజయంతో ఫ్రిట్జ్‌తో ఉన్న ముఖాముఖి రికార్డ్‌ను జకోవిచ్ 11-0తో మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విజయాన్ని జకోవిచ్ తన కూతురు బర్త్‌డే కానుకగా అందించాడు.

సెమీస్‌కు సబలెంకా

మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా సెమీస్ కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మార్కేటా వాండ్రౌసోవా గాయంతో వైదొలిగడంతో సబలెంకాకు సెమీప్ బెర్త్ ఖాయమైంది. ఇతర మ్యాచ్‌ల్లో కోకో గాఫ్‌ను ఓడించి నవోవి ఒసాకా, బార్బోరా క్రెజికోవాపై గెలిచి జెస్సికా పెగులా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad