వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఒక రోజు ర్యాపిడ్ ఓపన్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్స్ చెస్ టోర్నమెంట్ విజయవంతంగా సాగింది. ఈ టోర్నమెంట్ కు అద్భుత స్పందన రాగా, 494 మంది చెస్ ప్లేయర్లు ఆడేలా చేయటం విశేషం. ఈ కార్యక్రమంలో మొత్తం 98 మంది విజేతలుగా నిలవగా 68 మందికి క్యాష్ ప్రైజులను సంస్థ అందజేసింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రాజశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలను, క్యాష్ ప్రైజులను అందజేశారు.
ప్రధాన పోటీల్లో ధ్రువ తోటా విజేతగా నిలిచి 30,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకోగా, రెండవ స్థానంలో ప్రణయ్ ఆకుల, మూడవ స్థానంలో కౌస్తువ్ కుందు నిలిచారు.
అండర్ 7 బాయ్స్-గర్ల్స్ కూడా..
అండర్ 15 గర్ల్-బాయ్స్, అండర్ 13 బాయ్స్-గర్ల్స్, అండర్ 11 బాయ్స్-గర్ల్స్, అండర్ 9 బాయ్స్-గర్ల్స్, అండర్ 7 బాయ్స్-గర్ల్స్ ల్లో కూడా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్టు వారస్ చెస్ అకాడమీ ఫౌండర్-చీఫ్ కోచ్ రాఘవ్ శ్రీవాత్సవ వెల్లడించారు.