Saturday, November 15, 2025
HomeఆటInd vs Eng: అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి .. మూడు మ్యాచుల్లో 10 వికెట్లు..!

Ind vs Eng: అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి .. మూడు మ్యాచుల్లో 10 వికెట్లు..!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20ల సిరీస్‌లో టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసాధారణ ప్రదర్శన కొనసాగుతోంది. రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 మంది ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. బట్లర్, జెమీ స్మిత్, ఓవర్ టన్, కార్సే, ఆర్చర్, వికెట్లును వరుణ్ తీశాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది.

- Advertisement -

ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత టాప్ స్పిన్నర్ అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడంతో. భారత క్రికెట్ అభిమానులు అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టీ20ల్లోనూ సత్తా చాటాడు. కోల్ కతాలోని జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్, చెపాక్ లో జరిగిన రెండో మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు.

వరుణ్ భారత్ తరపున 2021లో టీ20 మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 16 టీ20లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి.. 29 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం బాధాకరమని అభిమానులు అంటున్నారు. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత సెలెక్టర్లు ప్రోత్సహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad