ఇంటర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, భీమా క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నీ క్రికెట్ టీం సభ్యులకు మినిస్టర్ క్వార్టర్స్ లో స్పోర్ట్స్ డ్రెస్, బ్యాట్లు సంబంధిత కిట్ పంపిణీ చేశారు. క్రికెట్ లో మరింతగా రాణించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇంటర్ లో(ఎంపిసి,బైపిసి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ అమృత జూనియర్ కాలేజి, యూనిక్ అకాడెమీకి చెందిన విద్యార్థిని, విద్యార్థులను మంత్రి వేముల అభినందించారు. వారికి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ ఉన్నత చదువులో ఇంతే పట్టుదలతో రాణించాలని మంత్రి కాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజి ఈసి సభ్యుడు బస్వరాజ్, శంకర్, కాలేజి యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.