Winter Olympics 2026: ఇటలీలోని అత్యంత ప్రసిద్ధ నగరం వెరోనా. ఇది మిలన్ మరియు వెనిస్ నగరాల మధ్య ఉంటుంది. వెరోనాలో ఉన్న పురాతన రోమన్ అరేనా ఒలింపిక్ క్రీడల కోసం ఆధునిక రూపాన్ని సంతరించుకుంటుంది. 2026 మిలన్ కార్టినా క్రీడలతోపాటు పారాలింపిక్ ప్రారంభ కార్యక్రమం కూడా ఇదే వేదికలో నిర్వహించనున్నారు. ఈ మార్పు వికలాంగులకు కలిసి రానుంది.
వెరోనా అరీనాను ఒకటో శతాబ్దంలో రోమన్లు నిర్మించారు. అప్పట్లో దీనిని గ్లాడియేటర్ పోటీలు కోసం ఉపయోగించేవారు. రీసెంట్ గా ఇదే వేదికపై ఫేమస్ ఒపెరా ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న జరిగే మిలన్ కార్టినా ముగింపు వేడుకలకు 11, 000 మంది, మార్చి 6న జరిగే పారాలింపిక్ ప్రారంభోత్సవానికి దాదాపు 10,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోమన్ అరేనా ఆధునీకరించే పరిస్థితి ఏర్పడింది.
ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ.. ఇప్పటికీ కూడా ఈ వేదిక అద్భుతంగా పనిచేస్తుందని ఆర్కిటెక్ట్ గియులియో ఫెనివ్స్ తెలియజేశారు. స్టేడియంలోకి ప్రవేశించేవారికి, వెళ్లేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లాజిస్టిక్ ను మెరుగుపరుచినట్లు ఆయన తెలిపారు. ఈ ఫేస్ లిస్ట్ 18 మిలియన్ యూరోల ($21 మిలియన్లు) ప్రాజెక్టులో భాగం.
వెరోనా ప్రధాన రైలు స్టేషన్ నుండి అరీనా వరకు ఒక కిలోమీటరు పొడవునా కాలిబాటలను వీల్‌చైర్లు లేదా బేబీ స్త్రోలర్‌ల కోసం చిన్న కర్బ్ ర్యాంప్‌లను నిర్మిస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేక బైక్ లేన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అరీనాలోకి అథ్లెట్ల పరేడ్‌లో పాల్గొనే పారాలింపియన్లు మార్గాన్ని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా దీనిని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
మెుత్తం ప్రాజెక్ట్‌లో భాగంగా.. అరేనాలోని 1950లలో తాత్కాలికంగా నిర్మించబడిన రైలింగ్ స్థానంలో కొత్త రైలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. 72 ప్రవేశ ద్వారాల వద్ద వివిధ ఎత్తులలో కొత్త హ్యాండ్‌రైల్‌లను నిర్మించారు. నగరానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో బాత్రూమ్‌లను పునరుద్ధరిస్తున్నారు. కొత్త ర్యాంప్‌లను తయారు చేస్తున్నారు.
.

