Amanjot Kaur Stunning Catch Video: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచి తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది టీమ్ ఇండియా. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై గెలిచి ట్రోఫీని దక్కించుకుంది భారత్. ఈ మ్యాచ్ హార్మన్ సేన గెలుచుకోవడానికి అమన్‌జోత్ కౌర్ పట్టిన క్యాచ్ కూడా ఒక కారణం. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 298 పరుగుల చేసింది. ఓపెనర్లు స్మతి మంధాన(45), షెఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58), రిచా ఘోష్(34) అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు కెప్టెన్ లారా వోల్వార్డ్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓ వైపు సహచరులు వికెట్లు పడుతున్న..మరోవైపు గోడలా నిలబడి అద్భుతమైన శతకం సాధించింది. క్రీజులో పాతుకుపోయిన లారా వికెట్ ను తీసేందుకు భారత్ శతవిధాల ప్రయత్నించింది. ఈ క్రమంలో అమన్‌జోత్ కౌర్ పట్టిన ఓ క్యాచ్ టీమ్ ఇండియాని విజయానికి దగ్గర చేసింది.
42వ ఓవర్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన బంతిని వోల్వార్డ్ భారీ షాట్ కొట్టింది. బంతి గాల్లోకి లేచి డీప్ మిడ్-వికెట్ పాయింట్ దిశగా దూసుకుపోయింది. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అమన్‌జోత్ కౌర్ బంతిని అందుకోవడానికి వేగంగా పరిగెత్తింది. ఈ క్రమంలో బంతి ఆమె చేతిలో నుంచి జారిపోయింది. అయినా సరే డైవ్ చేసి మరి బంతిని అద్భుతంగా పట్టుకుంది. ఈ క్యాచ్ పట్టినప్పుడు స్టేడియం మెుత్తం దద్దరిల్లిపోయింది. లారా ఔటైన తర్వాత సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్యాచ్ తర్వాత అమన్‌జోత్‌కు ‘క్వీన్ ఆఫ్ ది బౌండరీ’ అనే బిరుదును ఇచ్చారు.
Also read: Women’s World Cup: – విశ్వవిజేత భారత్:


