Saturday, November 15, 2025
HomeTop StoriesVirat Kohli: అడిలైడ్ లో చివరి వన్డే ఆడేసినట్లేనా.. కోహ్లీ గెశ్చర్ కు అర్థమేంటి?

Virat Kohli: అడిలైడ్ లో చివరి వన్డే ఆడేసినట్లేనా.. కోహ్లీ గెశ్చర్ కు అర్థమేంటి?

- Advertisement -

Virat Kohli Retiring From ODI Cricket?: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ.. తన ఫేవరేట్ గ్రౌండ్ అయిన అడిలైడ్ లో కూడా డకౌట్ అయ్యాడు. అయితే కోహ్లీ పెవిలియన్ చేరుతూ చేసిన గెశ్చర్ అభిమానులను ఆందోళనలో పడేసింది. కింగ్ కోహ్లీ చివరి మ్యాచ్ అడేశాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ఓపెన్ చేస్తే.. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూగా ఔటై పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ కు వీడ్కోలు పలుకుతూ కనిపించాడు. ఇందులో విరాట్ తల వంచి, రెండు గ్లౌజులను చేతుల్లో పట్టుకుని ప్రేక్షకుల వైపు అభివాదం చేస్తూ కనిపించాడు. తన రిటైర్మెంట్‌కు ముందు అడిలైడ్‌లో తన చివరి ఇన్నింగ్స్ ముగిసిందని చెప్పడానికి ఇలా చేశాడంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Also Read: IND vs AUS 2nd ODI- మళ్లీ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?

చెలరేగిన రోహిత్, శ్రేయస్..

మరోవైపు అడిలైడ్ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ను ఆసీస్ బౌలర్లు బెంబెలేత్తించారు. గిల్ స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. కోహ్లీ డకౌట్ అయ్యాడు. అయితే స్టార్ బ్యాటర్ రోహిత్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు చేసి టీమ్ ఇండియాను ఆదుకున్నారు. రోహిత్ 97 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లుతో 73 పరుగులు చేయగా.. శ్రేయస్ 77 బంతుల్లో 7 ఫోర్లుతో 61 పరుగుల చేశాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్, సుందర్, నితీష్ తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరగా.. మరోవైపు అక్షర్ పటేల్(44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో హర్షిత్ రాణా మెరుపులు మెరిపించడంతో టీమ్ ఇండియా 50 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad