Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. మిగతా ఆటగాళ్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ టెస్ట్ చేసుకుంటుంటే, కోహ్లీ మాత్రం లండన్‌లోనే ఈ టెస్ట్ పూర్తి చేశాడు. ఇది క్రికెట్ వర్గాల్లో కొత్త వివాదాన్ని రేపుతోంది.
ALSO READ : Rare Feat: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..
ప్రస్తుతం కుటుంబంతో లండన్‌లో ఉంటున్న కోహ్లీ, అక్కడే టెస్ట్ చేసుకునేందుకు బీసీసీఐ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నాడు. యో-యో టెస్ట్, స్ట్రెంత్ టెస్టుల్లో అతడు సక్సెస్ అయ్యాడు. ఇది ఇండియన్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఇలాంటి మినహాయింపు అని చెబుతున్నారు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు బెంగళూరు ఎన్‌సీఏలో టెస్టులు చేశారు. యువ ఆటగాళ్లు జితేష్ శర్మ, రుతురాజ్ గాయక్వాడ్, అభిషేక్ శర్మ కూడా అక్కడే హాజరయ్యారు.
ఇటీవల ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో బీసీసీఐ ఫిట్‌నెస్‌పై కఠినంగా ఉంది. సిరీస్‌లకు ఎంపిక కావాలంటే ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ తప్పనిసరి. అయితే, స్టార్ ప్లేయర్ కోహ్లీకి మాత్రం ఈ మినహాయింపు ఎందుకు? అని ప్రశ్నలు వస్తున్నాయి. కోహ్లీ టీమ్‌కు కీలకం, అతడి ఫామ్ టోర్నమెంట్లను నిర్ణయిస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు ఇది స్టార్ కల్చర్‌ను ప్రోత్సహిస్తుందంటున్నారు.
ALSO READ : Asia Cup 2025: ఆసియా కప్‌లో ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నం కాబోతున్న టీమిండియా బ్యాటర్లు వీళ్లే..!
రెండో దశలో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నీతిష్ రెడ్డి లాంటి ఆటగాళ్లు టెస్ట్ చేయనున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ ముందు ఇది ముఖ్యం. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. బీసీసీఐ ఇతరులకు కూడా ఇలాంటి అనుమతి ఇస్తుందా? లేదా? చూడాలి. కోహ్లీ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవడం టీమ్‌కు మంచి సంకేతం.


