Virat Kohli Creates History: కింగ్ కోహ్లీ రికార్డులు తిరగరాయడం కొత్తమీ కాదు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను అధిగమించి కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్న సంగతి తెలిసిందే.
గురువు తర్వాత..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు కోహ్లీ సంగక్కర రికార్డును బ్రేక్ చేయాలంటే 54 పరుగులు చేయాలి. చివరి వన్డేలో కోహ్లీ 74 పరుగులు చేయడంతో రెండో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ కేవలం 293 వన్డే ఇన్నింగ్స్‌లోనే 14,255* పరుగులు చేశాడు. 380 వన్డే ఇన్నింగ్స్‌లలో 14,234 పరుగులు చేసిన కుమార సంగక్కర మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
యావరేజ్ లో తోపు..
వన్డే హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 10 బ్యాటర్లలో 50 కంటే ఎక్కువ సగటు (దాదాపు 57.71) ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ మాత్రమే కావడం విశేషం. ఈ విషయంలో అతని ఆరాధ్య ధైవం సచిన్ సగటు 44.83గా ఉంది. వన్డేల్లో కోహ్లీ స్టైక్ రైట్ 93.26గా ఉంది. నాలుగో స్థానంలో 13,704 పరుగులతో రికీ పాంటింగ్, 13430 రన్స్ తో జయసూర్య ఐదో స్థానంలో ఉన్నారు.
Also Read: IND vs AUS ODI 3rd- రో-కో విధ్వంసం.. భారత్ సంచలన విజయం
ఒకే ఒక్కడు..
2008లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ 50 ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్‌లో 50 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. తాజా సెంచరీతో కలిసి ఇతడి ఖాతాలో 51 శతకాలు ఉన్నాయి. ఇతని గురువు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(49) కూడా ఇతని తర్వాత స్థానంలోనే ఉన్నాడు. తాజా హాఫ్ సెంచరీ కోహ్లీకి వన్డే ఫార్మాట్‌లో 75వది. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై వన్డేలలో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.


