Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ సరదాగా అందర్ని నవ్వించాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ లండన్‌లో తన ‘యువీకెన్ ఫౌండేషన్’ కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.
అయితే ఈ కార్యక్రమానికి పలువురు క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్‌తో స్టేజ్‌పై హోస్ట్ పిలవగా.. విరాట్ కోహ్లీ నవ్వుతూ స్పందించాడు. ఆ తర్వాత మాట్లాడిన విరాట్ కోహ్లీ మాటల్లో..”రెండు రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ఇలా నాలుగు రోజులకు ఒకసారి గడ్డానికి రంగు వేస్తున్నామంటే ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చిందని అర్థం” అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ మాటతో అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు.
కోహ్లీ టెస్టు రిటైర్మెంట్..
ఈ ఏడాది మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 123 మ్యాచ్‌ల టెస్టుల కెరీర్‌లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉడడం విశేషం. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన ఘనత కూడా కోహ్లీదే దక్కింది. అయితే అంతకుముందు రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోగా.. ఆ ప్రకటన తర్వాత ఐదు రోజులకే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.


