Saturday, November 15, 2025
HomeTop StoriesVirat Kohli: ఎస్కలేటర్‌ మీద నుంచే ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌.. కోహ్లీ వీడియో వైరల్‌

Virat Kohli: ఎస్కలేటర్‌ మీద నుంచే ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌.. కోహ్లీ వీడియో వైరల్‌

Virat Kohli Sydney Airport: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వరుస డకౌట్లతో వార్తల్లో నిలుస్తున్నా.. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ మాత్రం తగ్గలేదు. మూడో వన్డేలోనైనా ఫ్యాన్స్‌కు పరుగుల విందు ఇవ్వాలని ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో మూడే వన్డే నేపథ్యంలో కోహ్లీ సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడనే వార్త తెలియగానే అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కట్టారు. ఎస్కలేటర్‌పైన ఉన్నా సరే.. ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌ అంటూ ఫ్యాన్స్‌ పోటెత్తారు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ind-vs-aus-03rd-odi-preview-check-out-squad-weather-toss-time-and-streaming-details/

మూడు వన్డేల సిరీస్‌లో పెర్త్, అడిలైడ్‌లో విరాట్‌ ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎలాగైతే క్యూ కట్టారో.. ఇప్పుడు శనివారం(అక్టోబర్‌ 25) జరగనున్న మూడో వన్డే నేపథ్యంలో సిడ్నీలోనూ అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఎయిర్‌పోర్టులో ఎస్కలేటర్‌ మీద నుంచి అభిమానులకు కోహ్లీ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆటుపోటులు ఎదురైనా.. ఎల్లప్పుడూ కోహ్లీకి సపోర్ట్‌గా ఉంటామంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  

Also Read: https://teluguprabha.net/sports-news/ind-v-aus-highlights-02nd-odi-australia-win-by-two-wickets-in-adelaide-takes-2-0-lead/

ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన విరాట్‌ కోహ్లీ.. మూడో మ్యాచ్‌లో అయినా పరుగుల వరద సృష్టించాలని చూస్తున్నాడు. తనమార్క్ ఇన్నింగ్స్‌తో అభిమానులకు మరిచిపోలేని ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకు అనుగుణంగా మానసికంగా సన్నద్ధమవుతున్నాడు. శనివారం జరుగబోయే మూడో వన్డే కోసం జట్టుతో పాటు శుక్రవారం సిడ్నీకి చేరుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad