Wednesday, February 26, 2025
HomeఆటICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన బ్యాటింగ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లోనూ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. గతంలో 6వ స్థానంలో ఉన్న కింగ్ ప్రస్తుతం ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇక మరో భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. పాక్ బ్యాటర్ బాబర్ అజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా ప్లేయర్ క్లాసిన్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక శ్రేయర్ అయ్యర్ 9వ స్థానంలో.. కేఎల్ రాహుల్ 15 ర్యాంకులో నిలిచారు.

- Advertisement -

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్‌ తీక్షణ అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ ర్యాంకుకు పడిపోగా.. మహ్మద్ షమి ఒక స్థానం మెరుగై 14వ ర్యాంకులోకి వచ్చాడు. అలాగే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ నబీ అగ్రస్థానంలో, భారత సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News