ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్(India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ట్రోఫీని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లతో కివీస్ జట్టు బలంగా కనిపిస్తుంటే.. అదే స్థాయిలో టీమిండియా కూడా అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నాయి.
అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. నెట్ పేసర్ వేసిన బంతి నేరుగా కోహ్లీ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రాక్టీస్‌ను ఆపేశాడని సమాచారం. అనంతరం ఫిజియోస్ కోహ్లీకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. కోహ్లీకి తగిలిన గాయం చిన్నదే అని తెలిపారు. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడనే కోచింగ్ స్టాఫ్ తెలిపింది. గాయం గురించి తెలుసుకున్న కోహ్లీ ఫైనల్‌లో ఎలా ఆడతాడనే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గత మ్యాచ్‌ల్లో అదరగొట్టిన కోహ్లీ తుదిపోరులోనూ దుమ్మురేపి ఇండియాకు కప్ తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నారు.