టీ20లకు రిటైర్మెంట్‌పై టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20లకు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందో చెప్పారు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే తాను తప్పుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆటగాళ్లు జట్టులో సెట్ అవ్వాలని భావించినట్లు తెలిపారు. ఇప్పటినుంచి గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు ధృడంగా తయారవ్వాలనే ఉద్దేశంతోనే తాను రిటైర్మెంట్ ప్రకటించానని స్పష్టం చేశారు.
కాగా భారత్ తరపున విరాట్ కోహ్లీ 125 టీ20 మ్యాచులు ఆడగా.. 4,188 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు ఉన్నారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లీ అదరగొడుతూ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు.