HomeఆటVirat Kohli: రూ.3,542 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లీ.. షారుక్, ప్రియాంకలను వెనక్కి నెట్టేసి..

Virat Kohli: రూ.3,542 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లీ.. షారుక్, ప్రియాంకలను వెనక్కి నెట్టేసి..

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్‌గా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా–ఇంటర్‌బ్రాండ్ నిర్వహించిన తొలి ‘ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్’ అధ్యయనంలో కోహ్లీ బ్రాండ్ విలువ రూ.3,542 కోట్లుగా అంచనా వేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రూ.3,017 కోట్ల బ్రాండ్ విలువతో రెండో స్థానంలో నిలవగా.. నటి ప్రియాంక చోప్రా జోనాస్ రూ.2,507 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

ఈ అధ్యయనంలో కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం లేదా సినిమాల విజయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదు. సెలబ్రిటీలపై ప్రజల్లో ఉన్న నమ్మకం, అభిమానుల అనుబంధం, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం, ప్రత్యేక గుర్తింపు, దీర్ఘకాలిక బ్రాండ్ బలం వంటి అంశాలను పరిశీలించి ర్యాంకులను నిర్ణయించారు.

కోహ్లీ ఎందుకు నంబర్ వన్?
క్రికెట్ మైదానంలో తన అద్భుత ప్రదర్శనతో పాటు సామాజిక మాధ్యమాల్లో విరాట్ కోహ్లీకి ఉన్న భారీ ఆదరణ అతడి బ్రాండ్ విలువను మరింత పెంచింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన బ్రాండ్లతో అతడి అనుబంధం కూడా కోహ్లీ బ్రాండ్ ఇమేజ్‌ను బలోపేతం చేసింది. క్రికెట్‌కు మించి విస్తృత స్థాయిలో అభిమానులను ప్రభావితం చేయగల సామర్థ్యం కోహ్లీని అగ్రస్థానంలో నిలిపింది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News