Sunday, February 8, 2026
HomeఆటVirat Kohli: న్యూజిలాండ్‌పై కొహ్లీ విధ్వంసం.. సెంచరీతో చెలరేగిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌

Virat Kohli: న్యూజిలాండ్‌పై కొహ్లీ విధ్వంసం.. సెంచరీతో చెలరేగిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌

Virat Kohli Record Breaking Innings: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరి మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు తొలుత లక్ష్య ఛేదనలో తడబడింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో చెలగరేగిపోయాడు. సెంచరీతో కివీస్‌పై విరుచుకుపడ్డాడు. 40వ ఓవర్ చివరి బంతి నాటికి విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో సెంచరీని పూర్తి చేశాడు. ఇది కొత్త ఏడాదిలో విరాట్‌ కొహ్లీకి మొట్ట మొదటి సెంచరీ కావడం విశేషం. కోహ్లీ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. 95 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. ఇలా మొత్తం 103 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తున్నాడు. ఇది విరాట్ కెరీర్‌లో 54వ వన్డే సెంచరీ. ఇది కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 85వ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీల చెలరేగాడు, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 338 పరుగుల భారీ స్కోరును సాధించింది. తొలి వన్డేలో భారత్‌ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News