Virat Kohli: ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా.. ఇలాంటి సమయంలో భారత జట్టు తరఫున వన్డేల్లో రీ ఎంట్రీ కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే లార్డ్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో అతడు దాదాపు రెండు గంటలపాటు బ్యాటింగ్‌లో సాధన చేశాడు. ఈ క్రమంలో అతడు స్పిన్, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. మరోవైపు, రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ ఇంతకు ముందే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. అలాగే వీరిద్దరూ ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు కూడా తమ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు వీరిద్దరూ టీమ్‌లో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
Read Also: US Open 2025: యూఎస్ ఓపెన్ జూనియర్స్.. ‘మాయా’జాలం చూపిస్తుందా?
వారెప్పుడు రిటైర్ అవుతున్నారు?
మరోవైపు, ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని తాజాగా.. బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) ఖండించాడు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న శుక్లాను.. సచిన్ టెండుల్కర్ లా (Sachin Tendulkar) రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా ఫేర్‌వెల్ నిర్వహిస్తారా.. అని హోస్ట్ ప్రశ్నించాడు. దీనిపై అతడు కాస్త తీవ్రంగానే స్పందించాడు. ‘వారు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? రోహిత్, విరాట్ ఇప్పటికీ వన్డేల్లో ఉన్నారు. ఇంకా ఆడుతున్నారు కదా! అప్పుడే ఫేర్‌వెల్ గురించి మాట్లాడటం ఎందుకు? విరాట్ ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ అద్భుతంగా పరుగులు రాబడుతున్నాడు..’ అని రాజీవ్ శుక్లా సమాధానం చెప్పాడు.
Read Also: US Postal Services Halted: అమెరికాకు పార్సెల్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? ఇకపై కష్టమే..!
రన్ మెషీన్..
ఇప్పటి వరకు 302 వన్డేల్లో టీమిండియాకు కోహ్లీ ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 14,181 పరుగులు చేశాడు. ఇందులో 51 శతకాలు, 74 అర్ధశతకాలున్నాయి. వన్డేల్లో కోహ్లీ అత్యధికంగా 183 రన్స్. అలాగే 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో అతడు 9,230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోర్ 254. ఇకపోతే, 125 టీ20 మ్యాచ్‌ల్లో కోహ్లీ 4,188 రన్స్ సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలున్నాయి. టీ20ల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 122.


