Young girl’s reaction to India’s historic World Cup win: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది టీమ్ ఇండియా. ఈ విజయం భారత మహిళ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఈ గెలుపు స్త్రీ శక్తికి ప్రతీక. ఇక నుంచి నారీమణులు క్రీడల్లో పాల్గొనడానికి ముందుకు వస్తారు. వంటిట్లో గరిటె తిప్పడమే కాదు.. వరల్డ్ కప్ కూడా అందుకోగలమని నిరూపించారని మన క్రీడాకారిణులు. వాళ్లు ఆడిన తీరు కోట్లాది భారత మహిళలు గుండెల్లో ఉత్సాహాన్ని నింపింది. అయితే మన జట్టు వరల్డ్ కప్ అందుకున్న తర్వాత ఓ యువ అభిమాని మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈమె స్పష్టమైన ఇంగ్లీష్ భాషలో ఇరగదీసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ఓ బాలిక టీమ్ ఇండియా విజయంపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడింది. ఈ గెలుపును వివరించడానికి నా దగ్గర మాటల్లేవు. ఈరోజు ప్రతి క్రీడాకారిణి ప్రాణం పెట్టి ఆడింది. ముఖ్యంగా దీప్తి శర్మ మరియు షఫాలి వర్మ అద్భుతంగా ఆడారు. వారికి మిగతా వాళ్లు సహకరించిన తీరు బాగుంటుంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. నిజంగా మన అమ్మాయిలు చూపించిన తెగువ, అంకితభావం అమోఘం అంటూ భారత జట్టును ప్రశంసించింది. ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడటం చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆమె ఆంగ్లంలో అంత స్పష్టంగా మాట్లాడటం చూసి ఇంటర్నెట్ ప్రపంచం షాక్ అయిపోతుంది.
ఎక్స్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇంగ్లీష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో మళ్లీ తిరిగి షేర్ చేశారు. ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు తర్వాత ఎక్కువగా వైరల్ అయింది ఈ అమ్మాయే. ఈమె ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడటం చూసి నేనే షాక్ అయ్యా. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి అంటూ ఎక్స్ లో రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈమె ప్రెజెంటేషన్ బృందంలో చేరిస్తే బాగుండని ఒకరు.. డోనాల్డ్ ట్రంప్ యెుక్క మహిళా వెర్షన్ అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది .
Also Read: Viral Video – భారత్ కప్పు గెలవడానికి కారణమైన క్యాచ్ ఇదే భయ్యా..!


