Saturday, November 15, 2025
HomeఆటKane Williamson: "మేమే గెలిచాం": 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై విలియమ్సన్ చమత్కారం

Kane Williamson: “మేమే గెలిచాం”: 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై విలియమ్సన్ చమత్కారం

Kane Williamson’s Cheeky Response on 2019 World Cup: క్రికెట్ చరిత్రలో అత్యంత నాటకీయమైన మ్యాచ్‌లలో ఒకటి.. 2019 వరల్డ్ కప్ ఫైనల్. దీని గురించి న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ ఇటీవల తన మనసులో మాట పంచుకున్నాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి గురించి పునరాలోచిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -

ఆ ఫైనల్ మ్యాచ్.. 50 ఓవర్ల తర్వాత, ఆపై జరిగిన సూపర్ ఓవర్‌లోనూ టై అయింది. దీంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, ఆ మ్యాచ్ చివరి ఓవర్లో ఒక బంతికి అంపైర్లు ఆరు పరుగులుగా లెక్కించారు. కానీ, ఆ తర్వాత అది ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాల్సి ఉందని అంపైర్ కుమార్ ధర్మసేన అంగీకరించారు.

నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టాం..

ఈ విషయంపై స్పందించిన కేన్ విలియమ్సన్, “అవును, చూశారా? మేమే గెలిచాం. అది చాలా మంచి అనుభూతి” అని సరదాగా వ్యాఖ్యానించారు. అంపైర్లు చేసిన ఆ పొరపాటు గురించి తర్వాత వినడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని, అయితే అప్పటి క్షణంలో తమ నియంత్రణలో ఉన్న వాటిపై మాత్రమే దృష్టి పెట్టామని ఆయన చెప్పారు.

ఆ కీలక చివరి ఓవర్‌లో బెన్ స్టోక్స్ రెండు పరుగులు తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన త్రో అతని బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో అంపైర్లు ఆ రెండు పరుగులతో పాటు, ఓవర్‌త్రో బౌండరీకి వెళ్లినందుకు మరో నాలుగు పరుగులను కలిపి మొత్తం ఆరు పరుగులను ఇంగ్లాండ్ ఖాతాలో వేశారు. ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

నిబంధనల ప్రకారం, స్టోక్స్ రెండో పరుగు పూర్తి చేయకపోవడంతో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. కానీ, అంపైర్ల నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ గెలుపుకు అవసరమైన సమీకరణం సులభమైంది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ, విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad