Friday, November 22, 2024
HomeఆటWFI: ఎవరీ బ్రిజ్ భూషణ్ ? WFI ఆయన చేతుల్లో ఎందుకుంది?

WFI: ఎవరీ బ్రిజ్ భూషణ్ ? WFI ఆయన చేతుల్లో ఎందుకుంది?

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇప్పుడు ఈయన పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అసలు ఈ బ్రిజ్ భూషణ్ ఎవరు? ఆయన చేతుల్లోకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఎలా వెళ్లిందనేది ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న.

- Advertisement -

బీజేపీ ఎంపీగా ఆరు సార్లు గెలిచిన సీనియర్ రాజకీయ నాయకుడే ఈ బ్రిజ్ భూషణ్. ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గానికి ప్రస్తుతం ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నరు. 2011 నుంచి ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్ హెడ్ గా ఉన్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సుమీత్ మాలిక్, బజరంగ్ పూనియా వంటి రెజ్లింగ్ హేమాహేమీలు ఇప్పుడు ఈయన దిగిపోవాలని.. ఈయన ఆధ్వర్యంలో సాగిన లైంగిక కాండలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సిందేనంటూ ఏస్ రెజ్లర్స్ అంతా రెండు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగటం సంచనలం సృష్టిస్తోంది.

మహిళా రెజ్లర్లు, మహిళా రెజ్లింగ్ శిక్షకులపై గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు రెజ్లింగ్ ఫెడరేషన్ క్యాంపులో రొటీన్ గా మారాయంటూ కన్నీటి పర్యంతం అయ్యారు వినేష్ ఫోగట్. మరి ఇంతకాలం వీరంతా ఎందుకు ఇదంతా భరిస్తూ సైలెంట్ గా ఉన్నారన్నది ఎవరికీ అంతు చిక్కటం లేదు.

ఇక బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే ఇదంతా ఆసక్తికరంగానే ఉంది. ఆయనేం అల్లాటప్పా మనిషి కాదు అందుకే తనపై పెద్ద కుట్ర జరుగుతోందని ఇప్పుడు బ్రిజ్ భూషణ్ భగ్గుమంటున్నారు. గోండా, కైసర్ గంజ్, బలరాంపూర్ వంటి నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఈయన పనిచేసిన విస్తృత రాజకీయ అనుభవం ఉంది. గోండా నివాసి అయిన బ్రిజ్ భూషణ్ తాను యువకుడిగా ఉన్నప్పుడు స్వయంగా కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. 1980ల్లో విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో చేరారు. హిందుత్వ ఇమేజ్ తో ఈయన చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు కూడా. అయోధ్య రామ మందిర ఉద్యమ సమయంలో ఈయన పేరు మారుమోగింది కూడా. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ ఈయన నిందితుడిగా ఉన్నారు. కానీ 2020లో కోర్టు నిరపరాధిగా ఈయన్ను వదిలేసింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతోపాటు మరో 40 మందిపై అయోధ్య విషయంలో ఛార్జ్ షీట్ నమోదు కాగా వీరిలో బ్రిజ్ భూషణ్ కూడా ఒకరు. 1991లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు బ్రిజ్ భూషణ్.

దశాబ్దకాలంగా రెజ్లింగ్ ఫెడరేషన్ పై పట్టు బిగించిన ఈయన మంచి మాటకారి. ప్రస్తుతం 66 ఏళ్ల వయసున్న ఈయన తనపై వినేష్ ఫోగట్ వంటివారు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాలు చేశారు. వివాదం నేపథ్యంలో తాను బజరంగ్ పూనియాతో సహా చాలామందితో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికే ఆయన వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News