India-Pak match: ఆసియా కప్‌లో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లు ఆడొద్దని దేశ ప్రజలు అనేకసార్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అయితే పలు నిబంధనల మేరకే ఆదివారం ఆ మ్యాచ్ ఆడుతున్నట్లు ఐసీసీ, ఏసీసీ ప్రకటించింది. దీనిపై పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో బీసీసీఐ క్రికెటర్లను బలవంతపెట్టొద్దన్నారు. అసలు మ్యాచ్‌కి కూడా అంగీకరించకుండా ఉండాల్సిందని ఫైర్ అయ్యారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Also: Bigg Boss Voting: మారిపోయిన ఓటింగ్ స్థానాలు.. టాప్ లో కమెడియన్.. లీస్ట్ లో హీరోయిన్, కొరియోగ్రాఫర్
క్రికెటర్లను బలవంతపెట్టొద్దు
భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారని.. మిలిగినవారు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఐషాన్య అన్నారు. పాక్‌తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని కోరారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే వాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్‌ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్‌ను వీక్షించకుండా బహిష్కరించాలని కోరారు.
Read Also: BCCI Elections: బీసీసీఐ అధ్యక్ష రేసులో హర్భజన్ సింగ్..!
పహల్గాం ఉగ్రదాడి
పహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులు జరిపారు. కాగా.. ఈ ఉగ్రదాడిలో హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యాపారి శుభమ్ ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. కాన్పుర్‌కు చెందిన శుభమ్ ద్వివేదికి.. ఇషాన్యా ద్వివేదితో ఫిబ్రవరి 12న వివాహమైంది. ఆ తర్వాత ద్వివేది.. తన భార్యతో హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్లారు. వారు బైసరన్ లోయలో సరదాగా విహరిస్తున్న సమయంలో వారిని చుట్టుముట్టిన ఉగ్రవాదులు పేరు అడిగి ముందుగా ద్వివేది తలపై కాల్చి చంపినట్లు ఆయన భార్య పేర్కొన్నారు. ఆ దాడిలో ద్వివేదితో సహా 26 మంది పర్యాటకులు తమ ప్రాణాలను కోల్పోయారు.


