Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ ఘటన జరిగిన 91 రోజుల తర్వాత సోషల్ మీడియా పోస్టు పెట్టారు. ఇటీవలే ఆర్సీబీ కేర్స్‌ను ఫ్రాంచైజీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలను ఆర్థికసాయంగా అందించనుంది. ఇప్పటికే ఆరు పాయింట్లతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈక్రమంలో విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ప్రకటన జారీ చేశాడు. 18 ఏళ్ల తర్వాత కప్‌ను అందుకొన్న సంతోషం క్షణాల్లోనే విషాదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ‘‘జూన్ 4న హృదయ విదారక ఘటన జరిగింది. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం తీవ్ర విషాదంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం, గాయపడిన ఫ్యాన్స్ కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీకు కలిగిన నష్టం ఇప్పుడు మాలో భాగం. ఇక నుంచి మరింత జాగ్రత్తగా, గౌరవంగా, బాధ్యతతో కలసికట్టుగా ముందుకుసాగుతాం’’ అని కోహ్లీ పోస్టు పెట్టాడు.
Read also: Xi Jinping: శాంతా-యుద్ధమా? చర్చలా-ఘర్షణా? జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు
15 నివిషాల్లోనే విషాదంగా..
ఇకపోతే, బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుక 15 నిమిషాల్లోనే తీవ్ర విషాదంగా మారిపోయింది. ముఖ్యంగా తమ రాష్ట్రానికి చెందిన జట్టు కప్‌ను గెలుచుకోగా.. క్రికెటర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ముఖ్యంగా 35 వేల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా 2 నుంచి 3 లక్షల మంది వరకు వెళ్లారు. టిక్కెట్లు లేకపోయినా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారందరూ 30 ఏళ్లు లోపు వారే కావడం గమనార్హం. కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసింది. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది.
Read also: Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట.. 91 రోజుల తర్వాత స్పందించిన కోహ్లీ


