Asia Cup History: 2025 ఆసియా కప్ కౌంట్ డౌన్ మెుదలైంది. ఈ ఏడాది ఈ మెగా టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నారు. ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 21 వరకు జరగబోతుంది. ఈ క్రమంలో ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ఎక్కువ టైటిళ్లు గెలిచారు తదితర విషయాలు తెలుసుకుందాం.
ఆసియా కప్ చరిత్ర
ఆసియా కప్ సరిగ్గా 41 సంవత్సరాల క్రితం అంటే 1984లో ప్రారంభమైంది. అప్పుడు కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే టోర్నీ జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ మెగా టోర్నీలో చేరాయి. 2016 ముందు వరకు ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో నిర్వహించేవారు. కానీ 2016 నుంచి ఈ టోర్నమెంట్ ను కొన్ని సార్లు టీ20 ఫార్మాట్‌లో, కొన్నిసార్లు వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఆ ఏడాది లేదా దానికి సమీపంలో జరిగే పెద్ద ఐసీసీ టోర్నమెంట్ ఆధారంగా ఆసియా కప్ ఫార్మాట్ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ ఉంటే..ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఉంటుంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ ఉంటే ఆసియా కప్ 20 ఓవర్ల ఫార్మాట్‌లోనూ జరగనుంది. 2016, 2022లో ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగ్గగా..2018, 2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగింది.
మనదే హవా…
ఆసియా కప్ లో భారత జట్టు హవా నడుస్తోంది. ఇప్పటి వరకు టీమిండియా 8 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు టైటిళ్లను నెగ్గాయి. మన జట్టు 1984, 1988, 1990/91, 1995, 2010, 2016, 2018, 2023 సంవత్సరాల్లో ఆసియా కప్ గెలిచింది.
వివాదస్పద అంశాలు
1985లో భారత్-శ్రీలంక మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో 1986లో జరిగిన ఆసియా కప్ లో భారత్ ఆడలేదు. 1990-91లో మన దేశంలో జరిగిన ఆసియా కప్ పోటీల్లో రాజకీయ కారణాల కారణంగా పాకిస్థాన్ టోర్నీ నుండి వైదొలిగింది. ఇదే కారణం చేత 1993లో ఆసియా కప్ ను రద్దు చేశారు. 2020 నిర్వహించాల్సిన ఆసియా కప్ కరోనా కారణంగా రెండు సంవత్సరాలు వాయిదా పడింది.
Also Read: Bob Simpson – ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం కన్నుమూత..
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి భారత్..
ఈసారి 2025 ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లోనే ఉండబోతుంది. ఎందుకంటే 2026లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌లో 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ మెగాటోర్నీ సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ తో మెుదలుకానుంది. టీమ్స్ ను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి. ఇక్కడ ప్రతి జట్ట తమ గ్రూప్‌లోని మిగతా టీమ్స్ తో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్ సెప్టెంబరు 10న ఆతిథ్య యూఏఈతో ఆడబోతుంది. ఆసియా కప్ ను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించడం అనవాయితీ.
Also Read:Arjun Tendulkar engagement – క్రికెటర్ అర్జున్ టెండూల్కర్


