Team India Next Schedule 2025: ఆసియా కప్ విజయం తర్వాత భారత్ ఆడే తదుపరి మ్యాచ్ లపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీమిండియా అక్టోబరు నెల ప్రారంభంలో స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుండి జరగనున్న ఈ సిరీస్ లో టీమిండియా కంగూరు జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో రెండు టెస్టులు, మూడు వన్డేలు మరియు ఐదు టీ20లు ఆడబోతుంది.
భారత్ వర్సెస్ వెస్టిండీస్ పూర్తి షెడ్యూల్:
అక్టోబర్ 2–6, 2025: 1వ టెస్ట్, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ (భారత కాలమానం ప్రకారం, ఉదయం 9:30 గంటలకు)
అక్టోబర్ 10–14, 2025: 2వ టెస్ట్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ (ఉదయం 9:30)
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 19, 2025: 1వ వన్డే, పెర్త్ స్టేడియం, పెర్త్ (ఉదయం 9:00 గంటలకు)
అక్టోబర్ 23, 2025: 2వ వన్డే, అడిలైడ్ ఓవల్, అడిలైడ్ (ఉదయం 8:30 గంటలకు)
అక్టోబర్ 25, 2025: 3వ వన్డే, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ (ఉదయం 8:30 గంటలకు)
అక్టోబర్ 29, 2025: 1వ T20I, మనుకా ఓవల్, కాన్‌బెర్రా (ఉదయం 1:45 గంటలకు)
అక్టోబర్ 31, 2025: 2వ T20I, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1:45 గంటలకు)
నవంబర్ 2, 2025: 3వ T20I, బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ (మధ్యాహ్నం 1:45 గంటలకు)
నవంబర్ 6, 2025: 4వ T20I, గోల్డ్ కోస్ట్ స్టేడియం, కర్రారా ( మధ్యాహ్నం 12:45 గంటలకు)
నవంబర్ 8, 2025: 5వ T20I, ది గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 12:45 గంటలకు)
భారతదేశం వర్సెస్ దక్షిణాఫ్రికా పూర్తి షెడ్యూల్:
నవంబర్ 14–18, 2025: 1వ టెస్ట్, ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (ఉదయం 9:30 గంటలకు)
నవంబర్ 22–26, 2025: 2వ టెస్ట్, బర్సపారా క్రికెట్ స్టేడియం, గౌహతి (ఉదయం 9:30)
నవంబర్ 30, 2025: 1వ వన్డే, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచీ (మధ్యాహ్నం 1:30 గంటలకు)
డిసెంబర్ 3, 2025: 2వ వన్డే, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం, రాయ్‌పూర్ (మధ్యాహ్నం 1:30 గంటలకు)
డిసెంబర్ 6, 2025: 3వ వన్డే, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్టేడియం, విశాఖపట్నం (మధ్యాహ్నం 1:30 గంటలకు)
డిసెంబర్ 9, 2025: 1వ T20I, బారాబతి స్టేడియం, కటక్ (రాత్రి 7:00 గంటలకు)
డిసెంబర్ 11, 2025: 2వ T20I, మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం, న్యూ చండీగఢ్ (రాత్రి 7:00 గంటలకు)
డిసెంబర్ 14, 2025: 3వ T20I, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7:00 గంటలకు)
డిసెంబర్ 17, 2025: 4వ T20I, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో (రాత్రి 7:00 గంటలకు)
డిసెంబర్ 19, 2025: 5వ T20I, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ (రాత్రి 7:00 గంటలకు)


