WTC 2025-27 Points Table: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025- 27 సైకిల్ మొదలైన సంగతి తెలిసిందే. శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ తో ఈ సైకిల్ ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల్లో ఒక్క టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. ఇక ఈ సైకిల్ లో భాగంగా ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తమ తొలి సిరీస్ ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో ఇరు జట్లు ఐదు టెస్టులు ఆడనున్నాయి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన విషయం విధితమే.
ఈ మ్యాచులో ఇండియా 800లకు పైగా పరుగులు చేసినా పరాజయం చవిచూసింది. ఐదు సెంచరీలు చేసినా బౌలర్లు విఫలం కావడంతో పాటు ఫీల్డింగ్ లో క్యాచులు వదిలేయడంతో టీమిండియా మ్యాచ్ ను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అద్భుతంగా ఆడిన ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 25-27 సైకిల్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ సిరీస్ లో భాగంగా ఇంకా నాలుగు టెస్టులు జరగాల్సి ఉంది.
ఇక ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 159 పరుగులతో విజయం సాధించింది. మరో రెండు మ్యాచులు జరగాలి. ఈ క్రమంలో డబ్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టిక వచ్చింది. ఇందులో చెరో మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి స్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ జట్టుతో ఓ మ్యాచ్ గెలిచి.. మరో మ్యాచ్ డ్రాగా ముగించిన శ్రీలంక మూడో స్థానం దక్కించుకుంది.
ఇక బంగ్లా టీమ్ నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఈ సైకిల్ లో ఇంకా టెస్ట్ మ్యాచులు ఆడలేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ ఫైనల్ కు టీమిండియా అర్హత సాధించాలంటే కచ్చితంగా మిగిలిన టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్ తో జరగాల్సిన నాలుగు టెస్టులు గెలిస్తే మాత్రం గిల్ సేన మొదటి స్థానానికి చేరుకుంటుంది. కాగా బర్మింగ్ హామ్ వేదికగా రెండో టెస్టు జులై 2న విడుదల కానుంది.