India vs Australia 1st ODI 2025 Live: మరికొన్ని గంటల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య హైవోల్టేజ్ పోరు మెుదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. దాదాపు 8 నెలల తర్వాత రోహిత్, కోహ్లీ జట్టులోకి రావడంతో ఈ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ఈఏడాది ఫిబ్రవరిలో జరిగినా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 50 ఓవర్ల మ్యాచ్ ఆడలేదు. అంతేకాకుండా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇరువురు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించి.. గిల్‌కు బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా రోకో వన్డే కెరీర్ ఉంటుంది.
తెలుగోడికి ఛాన్స్..
కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు రోహిత్. నంబర్ 3 స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. భారత్ ఈ సారి ముగ్గురు ఆల్ రౌండర్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆరో స్థానంలో అక్షర పటేల్, ఏడో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సిరాజ్, అర్షదీప్ పేస్ దాడిని నిర్వహించనున్నారు. మూడో సీమర్ గా హర్షిత్ రాణాను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆసియా కప్ హీరో కుల్దీప్ కు ఈ మ్యాచ్ లో చోటు దక్కకపోవచ్చు.
Also Read: Salman Ali Agha -పాక్ కెప్టెన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన PCB.. అదేంటో తెలుసా?
టాస్ సమయం
భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ ఉదయం 9 గంటలకు మెుదలుకానుంది. టాస్ 8:30 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ టీవీ చానెల్ లో వీక్షించవచ్చు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ ఛానెల్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో కూడా ప్రసారం కానుంది.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.


