Sanju Samson viral news: టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఒకసారి రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడుతున్నాడని..మరోసారి ఆసియా కప్ లో ఆడబోయే తుది జట్టులో ఉండడని వార్తలు చక్కెర్లు కొట్టాయి. అంతేకాకుండా కేరళ క్రికెట్ లీగ్ లో అద్భుతంగా ఆడి తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. అయితే ఫైనల్లో సంజూ ఆడతాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్ తుది మెట్టుకు చేరుకుంది. ఫైనల్ కు చేరిన రెండు జట్లు తేలిపోయాయి. తొలి సెమీఫైనల్లో కొల్లం జట్టు త్రిస్సూర్ టైటాన్స్ ను పది వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటాన్స్ జట్టు కేవలం 86 పరుగులకే ఆలౌట్ కాగా..ఆ లక్ష్యాన్ని కొల్లం టీమ్ 10 ఓవర్లలోనే ఛేదించింది.
రెండో సెమీస్ లో కోచి బ్లూ టైగర్స్, కాలికట్ గ్లోబ్‌స్టార్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సంజూ లేకుండా కోచి టీమ్ బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ 186 పరుగులు చేసింది. సంజూ లేని లోటును నిఖిల్ తొట్టత్ తీర్చాడు. నిఖిల్ 7 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ముహమ్మద్ ఆశిక్ కూడా 10 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం బరిలోకి దిగిన కాలికట్ జట్టు 171 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు తరఫున అఖిల్ స్కారియా కేవలం 37 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. టైగర్స్ టీమ్ 15 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆశిక్ బౌలింగ్ లో కూడా రాణించి మూడు వికెట్లు తీశాడు.
Also Read: Asia Cup 2025 -ఈసారి జరగబోయే ఆసియా కప్ లో డేంజరస్ స్వ్కాడ్ ఏదో తెలుసా?
సెప్టెంబరు 7న జరగనున్న ఫైనల్లో కోచి బ్లూ టైగర్స్ జట్టు సంజూ శాంసన్ లేకుండానే బరిలోకి దిగబోతుంది. సంజూ లేకుండా సెమీస్ గెలిచినా ఫైనల్ అంత సులభం కాదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎక్కువ స్కోరు చేసిన బ్యాటర్ సంజూనే. అతను కేవలం 6 మ్యాచుల్లోనే 73 సగటుతో 186 స్ట్రైక్ రేట్‌తో 368 రన్స్ చేశాడు. ఇందులో 30 సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయి. సెమీఫైనల్ కు ముందే ఆసియా కప్ కోసం టీమిండియా తరఫున దుబాయ్ బయల్దేరి వెళ్ళాడు సంజూ.


