Saturday, November 15, 2025
HomeఆటRo - ko: ఇక దేశ వాలీ మ్యాచుల్లో రోహిత్, కొహ్లీ?

Ro – ko: ఇక దేశ వాలీ మ్యాచుల్లో రోహిత్, కొహ్లీ?

Ro- ko: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ కాగా.. చివరి వన్డేలో విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియాలో కేవలం వన్డే సిరీస్ మాత్రమే ఆడేందుకు వెళ్లిన రోహిత్ కొహ్లీలు తిరిగి స్వదేశానికి రానున్నారు. అయితే వీరిద్దరూ మూడో వన్డేలో ఆడిన ఆటతీరుతో ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ అయ్యారు. సిడ్నీలో తాము ఆడేది ఇదే చివరి సారి కావొచ్చని రోహిత్ శర్మ అనడంతో మరో సారి ఆస్ట్రేలియాలో ఈ ద్వయం బ్యాటింగ్ లో కనిపించకపోవచ్చు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఆసక్తిగా ఉందని విరాట్ కొహ్లీ చెప్పడం ప్రేక్షకులకు ఉత్సాహాన్ని తెప్పించింది.

- Advertisement -

Read Also: Bigg Boss: పాపం హెల్త్ ఇష్యూస్.. హౌస్ నుంచి రౌడీ బేబీ ఎలిమినేట్

మళ్లీ ఎప్పుడు మైదానంలో కనిపిస్తారు

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ ఎప్పుడు మైదానంలో కనిపిస్తారని సగటు క్రికెట్ అభిమాని చర్చించుకుంటున్నారు. అయితే నవంబర్ లో భారత్ లో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఉంది. కాగా ఈ సిరీస్ లో వీరు పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అప్పటి వరకు వీరిద్దరికి మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాల్సిందేనని బీసీసీఐ కోరుకుంటోంది. అందుకు విజయ్ హాజరే ట్రోఫీ, రంజీ ల్లో వీరిద్దరూ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: Bigg Boss Updates: హే ఎందుకు ఏడుస్తున్నావ్.. జనాలు చూస్తే నవ్వుతారు దరిద్రుడా

రంజీ ట్రోఫీలో పాల్గొనే అవకాశం..

ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఎలైట్‌, ప్లేట్‌ గ్రూప్ మ్యాచుల్లో నవంబర్ 1 నుంచి ముంబయి, ఢిల్లీ మ్యాచులు జరగనున్నాయి. ముంబయి తరఫున రోహిత్, ఢిల్లీ తరఫున విరాట్ కొహ్లీ ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మొదటి వన్డేలో రోహిత్ శర్మ, రెండు వన్డేల్లో విరాట్ కొహ్లీ ఫెయిల్ అయ్యారు. దీనికి కారణం మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే రాబోయే సిరీస్ లలో వీరిద్దరూ రాణించాలంటే మ్యాచ్ ప్రాక్టీస్ తప్పనిసరి అని భావిస్తున్నారు. అందుకే రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్ ఖుషీ

రో కో ఇద్దరు సిడ్నీవన్డేలో భారీ స్కోర్లు చేయడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ముఖ్యంగా రో కో ఇక 2027 వరల్డ్ కప్ వరకు ఢోకా లేదని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఎవరెంత అడ్డుకోవాలని ప్రయత్నించినా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడి తీరతారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కానీ అప్పటి వరకు ఇద్దరూ ఫిట్ నెస్ తో పాటు ఫుల్ ఫామ్ లో ఉండాలి. రెగ్యులర్ గా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేనే వచ్చే వరల్డ్ కప్ వరకు టీం మేనేజ్ మెంట్ దృష్టిలో ఉంటారు. లేకపోతే కష్టమేనని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత క్రికెట్ టీంలోకి యువకులు దూసుకువస్తున్నారు. ఇప్పటికే టీంలో స్థానాలకు పోటీ పడుతున్నారు. వారిని తట్టుకుని టీంలో ఉండాలంటే రో కో నిలకడగా రాణించాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad