WPL అంటే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ డబ్ల్యూపీఎల్ మ్యాచులు ముంబైలో సాగనున్నాయి. మార్చ్ 4-26 వరకు WPL మ్యాచులు ముంబై మహానగరంలోని పలు స్టేడియంల్లో జరుగుతాయి. ప్రారంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గా సాగనుంది. ఈమేరకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రకటన వెలువరించారు. ఇక ఈ మ్యాచుల్లో ఆటగాళ్ల వేలం పాటు ఈనెల 13న ముంబైలో జరుగనుందని ధుమాల్ తెలిపారు. ఈ ఏడాది ఇందులో 5 టీములు పాల్గొంటున్నాయి. ఈ WPL మ్యాచుల లైవ్ టెలికాస్టింగ్ రైట్స్ ను బీసీసీఐ ఏకంగా 951 కోట్లకు అమ్మడం హైలైట్. ప్రపంచంలో టీ20 తరువాత అంత భారీ స్థాయిలో WPL జరుగుతోండటం విశేషం. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాంలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ (లక్నో), అదానీ స్పోర్ట్స్ లైన్ అనే 5 ఫ్రాంచైజీలు WPLలో పాల్గొంటున్నాయి.